తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో నేడు రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. సప్త వాహనాలపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు. ఉదయం సూర్యప్రభ, చిన్నశేష వాహనం, గరుడు వాహన సేవలు, సాయంత్రం కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు, రాత్రికి చంద్రప్రభ వాహన సేవను నిర్వహించనున్నారు. కొవిడ్ కారణంగా వేడుకలను ఏకాంతంగా జరపాలని నిర్ణయించారు.
రథసప్తమి సందర్భంగా పలు సేవలను రద్దు చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవలు, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.