Union Budget 2025 : నిర్మలమ్మ బడ్జెట్‌పై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసలు గుప్పించారు. బడ్జెట్ సామాన్య ప్రజలకు ఊతమిచ్చేలా ఉందని, ఉపాధి కల్పన, ఉద్యోగావకాశాలు, ఎఫ్‌డీఐ, ప్రైవేట్ రంగంలో ఉత్తేజం నింపేలా ఉందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్లో ఆ దిశగా సాయం చేశారని చెప్పారు.
గత ఐదేండ్లుగా ఏపీ రాజధాని లేకుండా ఉందని, అమరావతి అభివృద్ధికి ప్రధాని మోదీ రూ. 15,000 కోట్లు కేటాయించినందుకు రాష్ట్ర ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2025) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Read More :
Mudra loans: ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు