Srisailam | శ్రీశైలం దేవస్థానానికి రాజమహేంద్రవరం వాసి కే రామిరెడ్డి పలు వెండి వస్తువులు విరాళంగా అందజేశారు. మంగళవారం ఆయన వీటిని అందించారు. 790 గ్రాముల బరువు గల మూడు వెండి కిరీటాలు, 435 గ్రాముల బరువు గల వెండి పళ్లెం, 485 గ్రాముల బరువు గల ఒక శఠారీ సమర్పించారు. భ్రమరాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత రామిరెడ్డి అధ్యాపకులు ఎం పూర్ణానందం, పర్యవేక్షకులు కే అయ్యన్న, గుమస్తా సావిత్రికి అందజేశారు. అనంతరం వీరికి దేవస్థానం అధికారులు తగు రశీదు అందజేశారు. అర్చక, వేద పండితులు దాతకు వేదాశీర్వచనం చేశారు. స్వామి అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.