అమరావతి : ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా (Deputy Speaker) రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నాలుగురోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూటమి ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ల పేర్లను ప్రకటించింది.
ఈ సందర్భంగా నిన్న డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పేరును మంత్రి నారా లోకేష్(Nara Lokesh) , డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan Kalyan), విప్ విష్ణుకుమార్‌రాజు ప్రతిపాదించారు.
ఒకే ఒక నామినేషన్ రావడంతో డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyannapatrudu) గురువారం శాసనసభలో ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
గత వైసీపీ హయాంలో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ పోటీగా గెలిచారు. అప్పటి సీఎం జగన్ విధానాలు నచ్చక పార్టీలోనే ఉంటూ పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు బాహటంగా విమర్షలు చేశారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ సర్కార్ రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసుపెట్టింది.