అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు నూతన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. ఏపీలో తనపై చేసిన సీఐడీ దాడి ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తనపై తప్పుడు కేసులు పెట్టి తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిలో సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ ఉన్నారని, ఘటనపై స్పీకర్ ఓంబిర్లా నివేదిక కోరినా సవాంగ్ స్పందించ లేదని ఫిర్యాదు చేశారు.
లోకసభ స్పీకర్‌కు త్వరగా నివేదిక పంపాలని కొత్త డీజీపీని కోరారు. పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని, ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరారు.