Pulivendula |పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌తో కలిసి టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఆఫీసులోనే నిర్బంధించారు.
వైఎస్ అవినాశ్ రెడ్డిని నిర్బంధించడాన్ని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తప్పుబట్టారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడకు వచ్చిన వైసీపీ కార్యకర్తలను వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోకపోవడంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో గురైన డీఎస్పీ కోయ ప్రవీణ్ వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్.. యూనిఫాం ఇక్కడ అంటూ వారికి వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. పులివెందులపై చంద్రబాబు, లోకేశ్ పగబట్టారని అన్నారు. రిగ్గింగ్ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారని.. ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. అన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొందామని స్పష్టం చేశారు.
కాల్చి పడేస్తా నా కొడకా!
పులివెందుల వైఎస్సార్ సిపి కార్యాలయం వద్ద దౌర్జన్యానికి పాల్పడిన డిఎస్పీ pic.twitter.com/jBwiIOR6Ls
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025