అమరావతి : వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ దాడి చేయడం పట్ల ఏపీలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ..దాడులకు పాల్పడ్డ నిందితులపై క్రిమినల్ సెక్షన్లను నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాలపై దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కాగా బాధితుడు సుబ్బారావు గుప్తా నిన్న మంత్రి బాలినేనిని విజయవాడలో కలిశారు. తాను బాలినేని, వైసీపీ విధేయుడని అన్నారు.