ఉపాధి కల్పిస్తున్న వాటినే పట్టుకుంటారా అంటూ ‘గాడిద’లతో వినూత్ననిరసన
Protest| ఏపీలోని కర్నూలు జిల్లాలో రజకులు వినూత్న నిరసన తెలిపారు. గాడిదలతో మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి ధర్నా
అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో రజకులు వినూత్న నిరసన తెలిపారు. గాడిదలతో మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి ధర్నా నిర్వహించారు. కర్నూలు పట్టణంలో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగు తున్న గాడిదలను నగర మున్సిపల్ సిబ్బంది వాటిని పట్టుకుని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. నగరంలోని రోడ్లపై గాడిదల సంచారంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నాయని వాటిని తీసుకొచ్చి మున్సిపల్ ఆవరణలో బంధించారు.
గాడిదల వల్లే తమకు ఉపాధి ఉందని, వాటిపైనే తమ వృత్తి ఆధారపడి ఉందని పేర్కొంటూ నగరానికి చెం దిన రజక వృత్తిదారుల సంఘం నాయకులు ఇవాళ మరికొన్ని గాడిదలతో వచ్చి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. పట్టుకున్న గాడిదలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రజకులకు దోభిఘాట్లను, గాడిదల కోసం షెడ్లను నిర్మించాలని సంఘం నాయకులు కోరారు. ప్రత్యేక షెడ్లను నిర్మిస్తే గాడిదలను రోడ్లపైకి కాకుండా షెడ్లలో ఉంచుతామని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
Mayookha | ‘మయూఖ’ మూవీ రివ్యూ.. భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్!
‘పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలి’
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

