Srisailam | శ్రీశైలం : వినాయకుడి ప్రతినామం మంత్రమేనని.. ప్రతి నామం ఎంతో మహిమానిత్వమని పురాణాలు చెబుతున్నాయని బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ అన్నారు. శ్రీశైల క్షేత్రంలో ‘గణపతి గాథలు’పై ప్రవచనాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమానికి ప్రారంభానికి ముందు జ్యోతిప్రజ్వలన చేసి.. ప్రవచనాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గణపతిని వేదాలు బ్రహ్మణస్పతిగా అభివర్ణించాయని.. తనను ఆశ్రయించిన భక్తులకు గణపతి బుద్ధిజ్ఞానాలను ప్రసాదిస్తాడని చెప్పారు. భక్తితో గణపతిని ఆరాధించడంతో ఎలాంటి విపత్తులు రావన్నారు.
గణపతి దూర్వాప్రియుడని, గరికతో గణపతిని పూజించడంతో శ్రేయస్సు కలుగుతుందన్నారు. శివశక్తుల ఏకత్వమే గణపతి అని.. శివుడు జ్ఞానమూర్తి అని, శక్తి ఆనంద స్వరూపిణి అని ఆ జ్ఞానానంద సమాహార స్వరూపమే గణపతి అని వివరించారు. గణపతి తన శక్తులతో యజ్ఞస్థలాన్ని విచ్చేసి, అభీష్టాలను సిద్ధింపజేస్తాడని పేర్కొన్నారు. ఆ స్వామి యజ్ఞయాగాదులలో ఆరాధింపబడే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికి ప్రభువై యజ్ఞఫలాన్ని అనుగ్రహిస్తారన్నాన్నారు. పవచనాల్లో గణపతిగాథలను, ఆయా కావ్యాలతో సంబంధం సంబంధం ఉన్న గణపతి క్షేత్రాల వైభవాన్ని, సనాతనధర్మం, వైదిక ఆచారాలకు సంబంధించిన పలు అంశాలను, శ్రీశైలక్షేత్రం మహిమలను భక్తులకు వివరించారు.