హైదరాబాద్ : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు కంచికచర్ల మండలం కేసర టోల్గేట్ వద్దకు రాగానే బస్సు వెనుక ఇంజిన్ పొగలు వచ్చాయి. గమనించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రయాణ సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, వరుస బస్సు ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బస్సు ప్రయాణం అంటేనే జడుసుకుంటున్నారు. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.