అమరావతి: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు రోజుల విశాఖ పర్యటన ఖరారయ్యింది. ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలో భాగంగా తూర్పు నౌకాదళం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈనెల 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు.
అక్కడ నేవల్ ఎయిర్‌స్టేషన్ నుంచి బయలు దేరి చోళసూట్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. 21న ఉదయం నేవల్ డాక్యార్డ్లోని ఎన్14ఏ జెట్టీ వద్దకు చేరుకుని గార్డు నుంచి గౌరవ వందనం అనంతరం సుమిత్ర నౌకలోకి వెళతారు. మధ్యాహ్నం పీఎఫ్ఆర్ గ్రూపు ఫొటో దిగడం, స్టాంపు విడుదల తదితర కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. మరుసటి రోజు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారని తెలిపాయి.