అమరావతి : ఆంధ్రప్రదేశ్లోన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి ఫొటోను పెట్టాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. సాధారణ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎంపిక చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామాలాభివృద్ధికి కేంద్రం నుంచి విడుదల అవుతున్న నిధుల విషయంపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై రేపు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
గత నాలుగు నెలల నుంచి ఏపీలో పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉచిత పథకాలు ఎక్కువ కావడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఆయన విమర్శించారు.