Tirumala | తిరుమలలో సనాతన ధార్మిక సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు : టీటీడీ ఈవో
Tirumala | తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు టీటీడీ(TTD) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుపతి : తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు టీటీడీ(TTD) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సు (Sanatana Dharmic Conference)కు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో అధికారులతో ధార్మిక సదస్సుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరగనున్న సనాతన ధార్మిక సదస్సులో దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామిజీలు పాల్గొంటారన్నారు. సదస్సుకు వచ్చే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించాలన్నారు. సదస్సులో ప్రతి స్వామిజీకి ఒక లైజన్ అధికారిని నియమించి దర్శనం, వసతి, ఆహార, రవాణా తదితర కమిటీలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

