తిరుమల : తిరుమల (Tirumala) లో యూ ట్యూబర్ ఒకరు చేసిన ప్రాంక్ వీడియోలు (Prank video) కలకలం సృష్టిస్తుంది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మరోవైపు టీటీడీ(TTD ) పోలీసులను కోరింది. నారాయణగిరి షెడ్స్ లోని క్యూ లో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియోను రూపొందించారు.
కంపార్టుమెంట్( Compartments) లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టే వీడియో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాట (Tamilnadu) వైరల్ అయ్యింది. కాగా ఈ ఘటనపై టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య అని పేర్కొంది. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఎన్నడూ లేని విధంగా తిరుమలలో ప్రాంక్ వీడియో చేసిన టీటీడీ ఉద్యోగులు.. విచారణకి ఆదేశించిన విజిలెన్స్ అధికారులు.#Tirumala #Tirupati #TTD #AndhraPradesh pic.twitter.com/9qTFxtyLdD
— Andhra One (@AndhraOne) July 11, 2024
సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించాక ముందే భక్తుల నుంచి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుందని అధికారులు వివరించారు. ఒకరిద్దరు ఆకాతాయీలు చేసిన ఈ వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిపారు.