KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏపీలో రెడ్‌బుక్ పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై మండిపడ్డారు. రెడ్‌బుక్ తీస్తానని నారా లోకేశ్ బెదిరిస్తున్నాడని.. నా బుక్ తీశానంటే నువ్వు ఉండవని హెచ్చరించారు. నా పవర్ గురించి నీ బాబును కనుక్కో అని సూచించారు.
వైజాగ్‌లో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. నువ్వు తీసే బుక్ ఏంటి? ఎంతమంది మీద దాడి చేయిస్తున్నావని నారా లోకేశ్‌పై మండిపడ్డారు. నిన్ను జైల్లో పెట్టి తీరతా అని హెచ్చరించారు. నీ బాబు జైలుకు వెళ్తాడని చెప్పా.. అన్నట్టే జరిగిందని గుర్తుచేశారు. ‘ ఏం వాగుతున్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకో.. ఇంకా ఎవరైనా వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడిని అయినా టచ్ చేస్తే.. నీ బాబును జైల్లో పెడతా.. నిన్ను జీరోను చేస్తా’ అని వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉందని పిచ్చోడిలా బిహేవ్ చేయొద్దు.. బీకేర్‌ఫుల్ హితవు పలికారు.
రాజశేఖర్ రెడ్డి గోరు తీయడానికి కూడా నువ్వు సరిపోవు.. నువ్వెంత అని నారా లోకేశ్‌పై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మీ నాన్న చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డికి భయపడేవాడు. రాజశేఖర్ రెడ్డి హాని చేయకుండా నీ బాబును కాపాడా. మీ నాన్న నా శిష్యుడు. 22 సంవత్సరాలు నా దీవెనలు తీసుకున్నాడు.’ అని తెలిపారు. నా స్పిరిట్యూవల్ పవర్ వాడానో.. వాడు ట్రంప్ అయినా.. బైడెన్ అయినా దిక్కు లేదు.. మోదీ అయినా దిక్కు లేదు అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తన మీద కేసులు పెట్టలేదని కేఏ పాల్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తనను కలిసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఆయన పిలిస్తే వెళ్తానని తెలిపారు. అపోజిషన్ లేకుండా చేసి చంద్రబాబు, పవన్‌ను బీజేపీ తొత్తులుగా చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ప్యాకేజి స్టార్లు చిరంజీవి, పవన్ కల్యాణ్, షర్మిలను మరిచిపోయి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.. ప్రజల్ని గెలిపిద్దామని పిలుపునిచ్చారు.
పార్టీలోంచి వెళ్లిన నాయకుల కన్నా KA పాల్ చాలా బెటర్ 👍 https://t.co/P5SFD6nq3P
— Rahul (@2024YCP) February 4, 2025