అమరావతి : ముంబయి సినీనటి (Mumbai film actress ) కాదంబరి జత్వానిని నిర్భందించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల(IPS Officers) ముందస్తు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు (AP High Court) ఈనెల 23కు వాయిదా వేసింది. ఈ కేసులో వారిని అరెస్టు చేయవద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
ఐపీఎస్లు కాంతిరాణా టాటా(Kanthirana Tata), విశాల్ గున్ని(Vishal Gunni), ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, ఇంకొల్లు న్యాయవాది ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశామన్న పీపీ లక్ష్మీనారాయణ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కౌంటర్ వేసేందుకు మరికొంత సమయం కావాలని కోరిన పీపీ చేసిన విజ్ఞప్తితో విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు.