Srisailam | శ్రీశైల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించకుండా స్థల పవిత్రతను కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని శ్రీశైలం సీఐ ప్రసాదరావు అన్నారు. వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి వచ్చే యా త్రికులతోపాటు స్థానికంగా వ్యాపారాలు చేసుకునే కొదరు దేవస్థాన నిబంధనలను అతి క్రమించడం సమంజసం కాదని హెచ్చరించారు.
ఆదివారం దేవస్థానం క్షేత్ర పరిధిలోని పలు ప్రాంతాల్లోని షాపులలో సీఐ ప్రసాదరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు పదార్థాలతోపాటు మద్యం వంటివి క్షేత్ర ప్రవేశం చేసేందుకు ప్రయత్నించినా, విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హెచ్చరికలు ఉల్లఘించి గుట్కా, ఖైనీ తదితర మత్తు పదార్థాల విక్రయాలు చేసే వారిపై ఏపీ ఆధ్యాత్మిక చట్టం 1987 23/ (1) (1) (వి) సెక్షన్ క్రింద కేసులు నమోదు చేసి ఆయా షాపులను సీజ్
చేయనున్నట్లు సీఐ చెప్పారు.