Tirumala | తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని ప్రార్థిస్తూ వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
రాష్ట్ర వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నాయకులు పీలేరు నుంచి పాదయాత్ర చేస్తూ తిరుపతికి వచ్చారు. శ్రీవారి మెట్టు మార్గంలో కొండపైకి బయల్దేరారు. ఈ క్రమంలో చంద్రగిరి పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థులు అని కూడా చూడకుండా వారిని మెట్లపై ఈడ్చుకుంటూ కిందకు తీసుకొచ్చారు. అనంతరం చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. టీటీడీ అధికారులు అనుమతి ఇస్తేనే మెట్ల మార్గంలో పంపిస్తామంటూ పోలీసులు తెలిపారు. కాగా, శ్రీవారి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని వైసీపీ విమర్శించింది. శ్రీవారి సన్నిధిలోనూ మీ రాజకీయాలేంటి చంద్రబాబూ అని ప్రశ్నించింది.
శ్రీవారి మెట్టు మార్గంలో పోలీసులు అత్యుత్సాహం
అక్రమ కేసుతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావాలని ప్రార్థిస్తూ గోవింద నామస్మరణతో కాలినడకన శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకుల్ని అడ్డుకున్న పోలీసులు
రాష్ట్ర… pic.twitter.com/JCT18eWIE1
— YSR Congress Party (@YSRCParty) August 19, 2025