Pawan Kalyan | ఏపీలో ప్రభుత్వం మారబోతుందని పోలీసులు గుర్తించాలి : పవన్కల్యాణ్
Pawan Kalyan | ఏపీలో ప్రభుత్వం మారి కూటమి అధికారంలోకి రానున్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు.
అమరావతి : ఏపీలో ప్రభుత్వం మారి కూటమి ( Allaince) అధికారంలోకి రానున్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్నారు. కూటమి కార్యకర్తలను పోలీసులు (Police) ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కూటమి అధికారంలో వచ్చాక పారదర్శకంగా లేని పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏపీలో కుల గణనతో పాటు ప్రతిభ ఆధారంగా యువతకు వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కూటమి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి (Purendheswari) మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో ఏ వర్గం సంతోషం లేదని, భవిష్యత్ తరాలు బాగుండాలంటే కూటమి అధికారంలోకి రావాలని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

