హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): అనంతపురంలో 4 కంటైనర్ల నిండా రూ.5 వందల నోట్లతో కూడిన రూ.2 వేల కోట్ల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా పామిడి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా కంటైనర్లలో భారీగా కరెన్సీని గుర్తించారు.
పట్టుకున్న కరెన్సీ వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు.కాగా కరెన్సీని కొచ్చి నుం చి హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయానికి నాలుగు ప్రైవేట్ బ్యాంకుల వారు డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్టు సమాచారం.