అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీఆర్సీ సాధన సమితిలోని ఉద్యోగ సంఘాల నాయకులకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. తాడేపల్లిలోని బొప్పరాజు, డోలాస్‌నగర్‌లోని వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ, బండి శ్రీనివాస్ ఇళ్ల వద్ద భద్రతను
ఏర్పాటు చేశారు. పీఆర్సీ సాధన విషయంలో సాధన సమితి నాయకులు తొందరపడి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడాన్నిఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
దీంట్లో భాగంగా గత మూడురోజుల నుంచి వివిధ నిరసనలు తెలియజేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు నేడు సాధన సమితి నాయకుల ఇళ్లనుముట్టడిస్తారని ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విజయవాడ ధర్నాచౌక్ ఎన్జీవో హోమ్ వద్ద సైతం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేఆరు. ఎన్జీవో హోమ్‌కు వెళ్లే మార్గాలకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫిట్ మెంట్, హెచ్ఆర్ఏ పెంపుదల లేకపోవడం వల్ల గ్రామీణ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.