అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ల పోలీసులు అన్ని జిల్లాలో ఆంక్షలు విధించారు. గుంటూరులో పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఆరీఫ్ వెల్లడించారు. అర్దరాత్రి రహదారులపై కేక్ కటింగ్‌లకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో ఈరోజు రాత్రి 8 గంటల నుంచి బీచ్‌లు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులపై వేడుకలు నిషేదించినట్లు ఆయన పేర్కొన్నారు.
విజయవాడలోనూ ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రి 12 గంటల వరకే ఇండోర్ వేడుకలకు అనుమతి ఇస్తామని , వేడుకలల్లో సామర్థ్యానికి మించి ఎక్కువ మందికి అనుమతి లేదని విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాణా టాటా వెల్లడించారు. అర్దరాత్రి రోడ్లపై ఎవరూ తిరగకూడదని హెచ్చరించారు. బందరు, ఏలూరు, బీఆర్టీస్ రోడ్లు, పై వంతెనలు మూసివేస్తున్నామని పేర్కొన్నారు. ముందు జాగ్రర్త చర్యగా విజయవాడ నగరం 15 చోట్ల డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నామని వివరించారు.
రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకూ బార్లు తెరిచ ఉంచేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్న్ను మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని బేవరేజేస్ డిపోల మేనేజర్లకు ఆదేశాలు అందాయి.