అమరావతి : ఏపీ పోలీసులు వైసీపీ కీలక నేతకు బుధవారం నోటీసులు(Notice) అందజేశారు. వైసీపీ ప్రభుత్వ సలహదారుడిగా కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) గురువారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నాయకులను విచారించిన పోలీసులు సజ్జలకు నోటీసులు ఇవ్వడం సంచలనం కలిగించింది.
ఇప్పటికే ఈ కేసులో పలువురు ముఖ్య నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్లను పలు దఫాలుగా పీఎస్కు పిలిపించి విచారించారు. 2021లో వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు.