ఏపీ రాయచోటిలో పెద్ద ఎత్తున మద్యం ధ్వంసం
రాయచోటిలో కల్తీ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండేండ్ల క్రితం ఇలాగే పెద్ద మొత్తంలో అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసి రికార్డులకెక్కారు. ఇప్పుడు మరోసారి అదేమాదిరిగా సీజ్ చేసిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. గత రెండేండ్లలో దాదాపు 472 కేసులు నమోదు చేసి...
అన్నమయ్య జిల్లా : రాయచోటిలో కల్తీ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండేండ్ల క్రితం ఇలాగే పెద్ద మొత్తంలో అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసి రికార్డులకెక్కారు. ఇప్పుడు మరోసారి అదేమాదిరిగా సీజ్ చేసిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. గత రెండేండ్లలో దాదాపు 472 కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను మంగళవారం ధ్వంసం చేశారు.
సరిగ్గా రెండేండ్ల క్రితం జూలై 18 రూ.72 లక్షల విలువైన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనల మేరకు మరోసారి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి సమీపంలో మద్యం బాటిళ్ల ధ్వంసం చేపట్టారు. జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు పరిధిలోని 172 పోలీస్ స్టేషన్లలో రెండేండ్ల వ్యవధిలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ రాజకమల్ తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.92 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
రాయచోటి పట్టణం శివారులో పెద్ద మొత్తంలో మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేస్తున్న విషయం స్థానిక మీడియా ద్వారా తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విశాలమైన ప్రదేశంలో మద్యం సీసాలను వరుసగా నిలబెట్టి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. దాంతో ఆ ప్రాంతం అంతా మద్యం వాసనతో నిండిపోయింది. మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తున్న సమయంలో మందుబాబులు అయ్యో అంటూ విలపించగా.. మంచి పని చేస్తున్నారంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

