PM Modi | అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మోదీ షెడ్యూల్ ఖరారైంది.
బుధవారం ఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు మోదీ చేరుకోనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మోదీ వేదికపై ఉండనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మళ్లీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నేరుగా భువనేశ్వర్ వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.