MP Putta Mahesh | మా పార్టీ అధ్యక్షులను కొంచెం ఫ్రీగా వదిలేయండి.. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కామెంట్స్ వైరల్
MP Putta mahesh | పల్లెల్లో ఎవరో చిన్న వ్యక్తికి జరిమానా వేస్తున్నారు.. పొలిటికల్‌గా మాకు సమస్యలు వస్తున్నాయి. రూల్ ప్రకారమే ముందుకు వెళ్లండి..కానీ మాకు కూడా గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా రాకుండా ఎట్లా బ్యాలెన్స్ చేయాలో చూడండి సార్ అంటూ ఏపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ పక్కనే ఉన్న ఎస్పీని రిక్వెస్ట్ చేశారు.
MP Putta Mahesh | డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ తెలుగురాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం చూస్తూనే ఉంటాం. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే నియమనిబంధనల ప్రకారం జైలు శిక్ష, జరిమానాలు కూడా విధిస్తుంటారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అంటూ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే వారికి మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది.
తాజాగా ఏపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ చేసిన కామెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ప్రోత్సహిస్తున్నట్టు అర్థమవుతోంది. ఏలూరు జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ పుట్టా మహేశ్ మాట్లాడుతూ.. పల్లెల్లో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుకుంటున్నారు. జంగారెడ్డి గూడెంతోపాటు ఇతర చిన్న చిన్న పల్లెల్లో కానీ, పోలవరం ఏరియా పరిసర ప్రాంతాల వాళ్లకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడంతోపాటు విపరీతమైన చలాన్లు వేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. పల్లెల్లో ఎవరో చిన్న వ్యక్తికి జరిమానా వేస్తున్నారు.. పొలిటికల్‌గా మాకు సమస్యలు వస్తున్నాయి. రూల్ ప్రకారమే ముందుకు వెళ్లండి..కానీ మాకు కూడా గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా రాకుండా ఎట్లా బ్యాలెన్స్ చేయాలో చూడండి సార్ అంటూ ఎంపీ పుట్టా మహేశ్ పక్కనే ఉన్న ఎస్పీని రిక్వెస్ట్ చేయడం గమనార్హం. .
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో రోజుకు 30 ఫోన్లు వాటి గురించే వస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో స్థానిక మండల పార్టీ అధ్యక్షులు అడిగితే కొంచెం చూసి వారికి సపోర్ట్ చేయండి. మండల పార్టీ అధ్యక్షుడు పొలిటికల్‌గా ఏమతుందంటే.. ఒక ఎస్‌హెచ్‌వోతో ఏదైనా పనిచేయించుకోవాలంటే అది కూడా చేయించుకోలేకపోతున్నారనే సమస్య కూడా ఉంది. ఎస్‌హెచ్‌వోలతో మా మండలం పార్టీ అధ్యక్షులకు, కార్యకర్తలకు మీరే మినహాయింపు ఇస్తే బాగుంటుందని కోరారు. అధికారిక సమావేశంలో మా పార్టీ వాళ్లు పనులు చేయించుకోవడానికి సహకరించండి..డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వారికి మినహాయింపు ఇవ్వండి అంటూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ఏలూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల ఇబ్బందులు మా పార్టీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు
రోజుకు 30 ఫోన్లు వాటి గురించే వస్తున్నాయి
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో మా మండల పార్టీ అధ్యక్షులు అడిగితే కొంచెం చూసి వారికి సపోర్ట్ చేయండి
– టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ https://t.co/WluZJ6WBBm pic.twitter.com/Dz7Vnbj7tj
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2026
Read Also :
Strait of Hormuz | హర్మూజ్ దారి క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు, క్యూ లైన్లో మరో 26 షిప్స్..!
Bala Krishna | అమరావతిలో ఘనంగా ప్రారంభమైన NBK112.. బాలయ్య-కొరటాల సినిమాకి అంత ఖర్చు చేస్తున్నారా..!
Urine Leak | మూత్రం లీక్ అయ్యే సమస్యకు సిగ్గుపడాల్సిన పనిలేదు.. అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

