Pithapuram | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం పిఠాపురం మహారాజా కుటుంబాన్ని టీడీపీ నేతలు వేధిస్తున్నట్లు బయటకొచ్చింది. టీడీపీ నాయకుల దౌర్జన్యాన్ని పిఠాపురం మహారాజా మేనకోడలు చంద్రలేఖ కుటుంబమే స్వయంగా వెల్లడించింది.
‘1970 నుంచి తమ కుటుంబం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నాం. ఆ ఆస్తి మీద కొందరు కన్నేశారు. ఆ ఇంటిని ఖాళీ చేయాలని, లేకుంటే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ దౌర్జన్యం వెనుక టీడీపీ నేతల సహకారం ఉంది. అందుకే ఫిర్యాదు చేసినా పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు.’ అని చంద్రలేఖ కుమారుడు మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమని పేర్కొన్నారు.
పిఠాపురం మహరాజు కుటుంబానికి టిడిపి వేధింపులు…
ఆస్ది కోసం 1970 నుండి ఆర్టీసి బస్టాండ్ వద్ద నివాసం ఉంటున్న పిఠాపురం మహరాజా మేనకోడలు చంద్రలేఖ కుటుంబానికి బెదిరింపులు.
దౌర్జన్యం వెనుక టిడిపి నాయకుల సహకారం ఉందని ఆరోపించిన చంద్రలేఖ కుమారుడు మాధవరావు.
ఇళ్ళు ఖాళీ చేయకపోతే SC, ST… pic.twitter.com/erRLx5xURE
— Jagananna Connects (@JaganannaCNCTS) July 31, 2024