Nara Lokesh | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు టీడీపీ కార్యకర్తల నుంచే వినిపించగా.. ఇప్పుడు సెకండ్ గ్రేడ్ కేడర్ కూడా ఈ డిమాండ్‌ను వినిపిస్తుంది. తాజాగా మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అడిగారు.
నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని, దీన్ని సోషల్ మీడియా, మీఇయా ఛానళ్లు వక్రీకరించడం సరికాదని హితవుపలికారు. నారా లోకేశ్ కష్టాన్ని గుర్తించాలని కేడర్ కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఓడిపోయి, భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం.. సీఎం అని అంటున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ను కూడా జనసేన కార్యకర్తలు సీఎం.. సీఎం అని పిలుస్తున్నారు.. అలాంటిది తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేశ్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని నిలదీశారు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేశ్ డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని.. కార్యకర్తల మనసులోని మాట అని చెప్పారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని.. అది కార్యకర్తలు అందరికీ శిరోధార్యం అని స్పష్టం చేశారు.
నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను తాను సమర్థిస్తున్నానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేశ్ వంద శాతం అర్హుడని పేర్కొన్నారు. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేశ్ నిరూపించుకున్నారని అన్నారు. లోకేశ్ బాబు పోరాట పటిమను చూసి టీడీపీ కేడర్‌తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి, ఆయన నాయకత్వానికి జై కొట్టిందని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన లోకేశ్ పేరును పరిశీలించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.
Tirumala | తిరుమల కొండపై ఎగ్ పులావ్.. భక్తుల ఆగ్రహం