తిరుమల : సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తిరుమల, తిరుపతి దేవస్థానం కూడా అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇకపై నేరుగా నగదు చెల్లింపులే కాకుండా యూపీఐ (యూనిఫైడ్ పేయిమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా కూడా చెల్లింపులు చేపట్టే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద వసతి గదుల కేటాయింపు సమయంలో యూపీఐ విధానం ద్వారా చెల్లింపులను ఇవాళ్టి నుంచి టీటీడీ ప్రారంభించింది. ఈ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అవకతవకలకు చెక్ పడే అవకాశముంటుందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.