అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భజన పెంచారని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తండ్రి భజనను తగ్గించగా పవన్‌కల్యాణ్ పెంచారని విమర్శించారు. ఆదివారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
రాష్ట్రంలో అసమర్ధపాలన కొనసాగుతుందని, , ప్రభుత్వానికి దేనిపైనా కూడా కంట్రోల్ లేదని విమర్శించారు. కేంద్ర మంత్రి అమిత్ షా ( Union Minister Amit Shah) పర్యటన సందర్భంగా రాష్ట్రంలో అనేక సమస్యలుండగా వైఎస్ జగన్ ప్యాలెస్లోపై (YS Jagan Palace ) ఆరోపణలు చేయడం దౌర్బాగ్యకరమని పేర్కొన్నారు. సందు దొరికితే చాలు వైఎస్ జగన్‌పై బుదర చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు మాదిరిగా క్విడ్ప్రోకు పాల్పడి ఇళ్లను తీసుకోలేదని విమర్శించారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, తెలంగాణ నుంచి రూ. 8 వేల కోట్ల విద్యుత్ బకాయిలున్నాయని, వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబు అవివేకం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందని మరోసారి ఆరోపించారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ముమ్మాటికి మానవతప్పిదంతోనే జరిగిందని దుయ్యబట్టారు. గతంలో ఎప్పుడూ కూడా తిరుమలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. తిరుమలలో జరుగుతున్న మానవతప్పిదాలపై ఎన్డీయే ఎందుకు విచారణ జరిపించడం లేదని అంబటి నిలదీశారు.
నారా లోకేష్‌పై అమిత్ షా ఫిర్యాదు
రాష్ట్రంలో చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) ప్రవర్తన తీరుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తమ వద్ద సమాచారం ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడపడితే అక్కడ వసూళ్ల కార్యక్రమాన్ని చేస్తున్నారని , ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని , లోకేష్‌ను కంట్రోల్లో పెట్టాలని అమిత్ షా చంద్రబాబుకు సూచించారని తెలిపారు. చంద్రబాబుకు గత్యంతరం లేకనే పవన్‌ను డిప్యూటీ సీఎంగా చేశారని విమర్శించారు.