హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులకు శుక్రవారం శాఖలు కేటాయించారు. లాఅండ్ ఆర్డర్, జీఏడీ, పబ్లిక్ఎంటర్ప్రైజెస్ శాఖలు సీఎం చంద్రబాబు వద్దే ఉండగా మిగతా 24 మందికి వివిధ శాఖలు కేటాయించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. నారాలోకేశ్‌కు ఐటీ, మానవవనరుల శాఖను కేటాయించారు. నారాయణకు మున్సిపల్, పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక, వంగలపూడి అనితకు హోం, అచ్చెన్నాయుడికి వ్యవసాయశాఖ కేటాయించారు. మిగతా 18మంది మంత్రులకు వివిధ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.