Gunturu | గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కనిపెంచిన కొడుకునే తల్లిదండ్రులు కడతేర్చారు. ఈ విషాదకర సంఘటన తెనాలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నాజర్పేటలో నివాసముంటున్న ఓ కుటుంబంలో నిత్యం మద్యం తాగొచ్చి కొడుకు తల్లిదండ్రులను వేధిస్తున్నాడు.
వేధింపులు భరించలేక తల్లిదండ్రులు కుమారుడి పీక కోసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.