తిరుపతి : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాల (Karthika Brahmotsavams ) బుక్లెట్ ను టీటీడీ (TTD) ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు. ఈవో మాట్లాడుతూ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు.
డిసెంబరు 2వ తేదీ గజవాహనం, 3న బంగారు రథం, 5న రథోత్సవం, 6వ పంచమితీర్థాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ రాత్రి ఆయా వాహనాలపై స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవోలు గోవింద రాజన్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.