బుధవారం 08 జూలై 2020
Andhrapradesh-news - Jun 05, 2020 , 18:40:39

భూవివాదం వల్లే విజ‌య‌వాడ గ్యాంగ్‌వార్‌

భూవివాదం వల్లే విజ‌య‌వాడ గ్యాంగ్‌వార్‌

అమరావతి:  భూవివాద‌మే విజ‌య‌వాడ‌లో గ్యాంగ్‌వార్‌కు దారితీసింద‌ని నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. య‌న‌మ‌ల‌కుదురులలోని 7 సెంట్ల స్థలం కోసం కత్తులు, రాళ్లతో కొట్టుకున్నార‌ని .. ఈ ఘర్ష‌ణ‌కు సంబంధించి 13మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 

ఘర్షణకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. గత నెల 30న సందీప్‌, పండు అనే ఇద్దరు పాత స్నేహితుల‌ మధ్య స్థల విషయంలో వివాదం జ‌రిగి ఇరువర్గాలు కత్తులు, రాళ్లతో ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సందీప్‌ తీవ్రంగా గాయపడి మరుసటి రోజు మృతి చెందగా పండు గుంటూరు దవాఖానలో చికిత్సపొందుతున్నాడని ఆయన వివరించారు. నిందితుల నుంచి రాడ్లు, కత్తులు, కోడికత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నగరంలో గ్యాంగ్‌వార్‌, ఘర్షణలు పునరావృతమైతే సహించబోమని,  నగరంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. 


logo