(Viveka Murder) అమరావతి: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ.. కొందరిని అదుపులోకి తీసుకున్నది. కాగా, విచారణ చేపట్టిన సీబీఐ అధికారిపైనే ఇప్పుడు ఫిర్యాదు దాఖలైంది. వివేకానందరెడ్డికి పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి.. పులివెందుల కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారి రామ్ సింగ్‌పై ఆయన కోర్టుకు ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కొన్ని పేర్లు చెప్పాలని తనను ఒత్తిడి చేస్తున్నారని కృష్ణారెడ్డి తన పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
హత్య కేసులో కొందరి పేర్లు చెప్పమని తనపై ఒత్తిడి తెచ్చారని, సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో కృష్ణారెడ్డి కోరారు. తనను ఒత్తిడి చేస్తున్న విషయాన్ని ఇప్పటికే కడప ఎస్పీకి, పులివెందుల సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి వేరే పేర్లు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగాల్సి ఉన్నది.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..