భద్రాచలం, డిసెంబర్ 10: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 31 నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆన్లైన్ టికెట్ల సదుపాయం కల్పించినట్టు ఆలయ ఈవో రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టికెట్ల ధరలు రూ. 2000, రూ.1000, రూ.500, రూ.250 చొప్పున నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
ప్రత్యక్షంగా ఉత్తర ద్వార దర్శనానికి హాజరుకాలేని భక్తుల సౌకర్యార్థం రూ.2000, రూ.1000తో https:// bhadradritemple. tela ngana.gov.in వెబ్సైట్ ద్వారా బుధవారం ఉదయం 11 గంటల నుంచి బుకింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు. ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు 25 నుంచి జనవరి 10న ఉదయం 5 గంటల వరకు తానీషా కల్యాణ మండపంలో ఒరిజినల్ టికెట్లు పొందవచ్చని సూచించారు.