అమరావతి : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 59,065 కాగా 63,512 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879.3 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 184 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
తుంగభద్ర జలాశయానికి కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు జలాశయం 20 గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1632.34 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 72618 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 90865 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 103.138 టీఎంసీలుగా కొనసాగుతోంది.