Srisailam | దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఉండేందుకు వసతి గృహాలు లేకపోవడంవల్ల ఎదుర్కొనే సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని శ్రీశైలం దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సున్నిపెంటలో దేవస్థానం నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవన సముదాయంలో మౌలిక వసతుల కల్పన, నీటి ట్యాంకులు, విద్యుత్, డ్రైనేజి వంటి సౌకర్యాల కల్పన చర్యలు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా నిష్ణాతులైన పనివారిని కేటాయించి సుమారు 297 గృహాలను మూడు క్యాటగిరీలుగా ఫిబ్రవరి వరకు సిద్దం చేయాలని చెప్పారు. ఈవో వెంట ఈఈ నర్సింహారెడ్డి, డీఈలు చంద్రశేఖర్ శాస్త్రి, సుబ్బారెడ్డి, ఏఈ ప్రణయ్ ఉన్నారు.