అమరావతి : ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ్య(Rajya Sabha) సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు (Nominations) స్వీకరిస్తామని వెల్లడించింది. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉప సంహరణ , డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉంటుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎ న్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మూడు నెలల అనంతరం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపీదేవి వెంకటరమణ (Mopidevi Venkataramana) , ఆర్ కృష్ణయ్య ( R Krishnaiah) , బీద మస్తాన్‌రావు (Beeda Mastan Rao) విడుదల వారీగా పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా పత్రాలను రాజ్యసభ స్పీకర్‌కు అందజేశారు.
దీంతో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. అనంతరం వెంకటరమణ, బీద మస్తాన్‌రావు టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) సమక్షంలో టీడీపీలో చేరగా కృష్ణయ్య తటస్థంగా ఉన్నారు.