ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో నోబెల్ గ్రహీత ఎస్తేర్ ఢఫ్లో భేటీ అయ్యారు. ఈమె ఫ్రెంచె అమెరికన్ ఆర్థికవేత్త. 2019 లో ఆర్థిక శాస్త్రంలో అభిజిత్ బెనర్జీ, మైఖేల్ క్రీమెర్తో కలిసి ఈమె నోబెల్ బహుమతిని అందుకున్నారు. సీఎం జగన్తో భేటీ తర్వాత ఆమె సీఎస్, వివిధ శాఖల అధికారులతో కూడా భేటీ అయ్యారు. పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈమె కృషి చేస్తున్నందుకు ఈమెకు నోబెల్ వరించింది. సీఎం జగన్తో ఆర్థిక వ్యవహారాలు చర్చించారని అధికారులు తెలిపారు.