Nara Lokesh | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారని ఒకవైపు విద్యార్థినులు ఆందోళన చేస్తుంటే.. అది చిన్న విషయమని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇది చాలా చిన్న విషయం.. దీన్ని అనవసరంగా సెన్సేషనల్ చేయొద్దని మీడియాను హెచ్చరించారు. కాలేజీ హాస్టల్లో ఎక్కడా హిడెన్ కెమెరాలు లేవని.. ఎక్కడా ఒక వీడియో కూడా బయటకు రాలేదని స్పష్టం చేశారు.
ఎక్కడ చిన్న విషయం జరిగినా దాన్ని బ్లూ మీడియా పెద్దదిగా చేసి చూపిస్తుందని నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రధానంగా తాను విద్యా శాఖ మంత్రి అయ్యాక తనపై ఫోకస్ పెట్టారని.. కావాలనే రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హిడెన్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థినులు చెబుతున్నారు కదా అని మీడియా ప్రశ్నించగా.. వారిపై సీరియస్ అయ్యారు. అక్కడ కెమెరాలు ఉంటే మీరే చూపించండి అంటూ మండిపడ్డారు.
హిడెన్ కెమెరాలు లేవని.. పిల్లల ఫోన్లు అన్నీ చెక్ చేస్తే ఒక్క వీడియో కూడా దొరకలేదని నారా లోకేశ్ అన్నారు. వీడియోలు లేనప్పుడు సమాధానం ఎలా చెప్పాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. గుడ్లవల్లేరు ఘటన కేవలం నలుగురి మధ్య లవ్ స్టోరీ మాత్రమే అని.. అక్కడ కెమెరాలు లేవు.. వీడియోలు లేవని స్పష్టం చేశారు.
గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాల కేసుపై @naralokesh సొంత దర్యాప్తు. అక్కడ కెమెరాలు లేవని దాటవేత వైఖరి. ప్రశ్నలు వేసిన మీడియా ప్రతినిధులపై ఎగిరెగిరిపడ్డ లోకేష్. pic.twitter.com/DRWpLVZ0Am
— YSR Congress Party (@YSRCParty) September 1, 2024