న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం( NHRC ) నోటీసులు జారీ చేసింది. ఏపీలోని ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయని, తద్వారా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ.. నివేదిక ఇవ్వాలని నెల రోజుల క్రితం ఏపీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్హెచ్ఆర్సీ. ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఇవ్వకపోతే చట్టబద్దంగా తీసుకునే చర్యలకు కూడా సిద్ధం కావాలని జాతీయ మానవ హక్కుల సంఘం హెచ్చరించింది.