టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. పరీక్షల వ్యవహారంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనల వల్ల విద్యార్థుకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షకు సంబంధించిన పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్ , మాల్ ప్రాక్టీస్ లాంటి వాటి వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారాలపై ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన సమాధానంపై కూడా లోకేశ్ స్పందించారు. మంత్రి బొత్స ఇచ్చిన సమాధానం బాధ్యతా రాహిత్యం కిందికే వస్తుందని అన్నారు. పేపర్లు లీకైనట్లు వార్తలు వస్తుంటే.. పరీక్షలు పకడ్బందీ అంటూ ప్రకటనలిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మిగిలిన పరీక్షలైనా సరిగ్గా నిర్వహించాలని లోకేశ్ లేఖలో కోరారు.