Srisailam | ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. తన ఆహ్వానం మేరకు ఈ నెల 16న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రధాని మోదీ వస్తున్నారని అన్నారు. తన ఆహ్వానం మన్నించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు, శ్రీశైల దేవస్థానం పాలకమండలి సభ్యుడు మేడ మురళీధర్ రేఖా గౌడ్‌తో కలిసి భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను బైరెడ్డి శబరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు శేష వస్త్రాలతో సన్మానించి, తీర్థ ప్రసాదం, స్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. అన్ని శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.