తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న..ఆస్పత్రికి తరలింపు
నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
అమరావతి : నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. శుక్రవారం కుప్పం నియోజక వర్గం కేంద్రం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోవడంతో చికిత్స కోసం హుటాహుటినా కుప్పం ఆస్పత్రికి తరలించారు.
కుప్పంలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ విషయం తెలుసుకుని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తారకరత్నను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
నారా లోకేశ్ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11.03 గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా ‘యువగళం’ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పంలో ప్రారంభమైన యాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

