అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం(Andhra Pradesh Government) అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు(Name Change) ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగాభూ హక్కు- భూరక్ష పథకం పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి ‘ఏపీ రీసర్వే ప్రాజెక్టు ’ గా మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా( RP Sisodia) ఆదేశాలు జారీ చేశారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతకు ముందున్న పేర్లను మార్చిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలో వచ్చిన తరువాత పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం మన బడి – మన భవిష్యత్గా, అమ్మఒడి పథకం పేరు తల్లికి వందనంగా , గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. జగనన్న ఆణిముత్యాలు పథకానికి అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం గా నామకరణంగా, స్వేచ్ఛ పథకానికి బాలికా రక్ష గా పేరు మార్పు చేశారు.
విద్యాకానుక పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్రగా , జగన్ విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్, ఎస్సీలకు అమలవుతున్న జగననన విద్యా దీవెన పథకం పేరును అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్చారు. వైఎస్సార్ కల్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లికానుక, వైఎస్సార్ విద్యా వసతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యావసతిగా, జగన్ సివిల్ సర్విసేస్ ప్రోత్సహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సహాకాలుగా పేరు మార్చారు.