Srisailam |శ్రీశైలం, జూలై 28: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రంలో సోమవారం నాగుల చవితి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
సోమవారం తెల్లవారుజామునే తలస్నానాలు చేసి చలివిడిముద్ద, నువ్వుల ఉండలు, వత్తిపత్తి వస్త్రమాల యజ్ఞోపవీతం పలు రకాల పూలు పండ్లతో ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్టలో కొలువైన జంటనాగుల విగ్రహాలకు పూజలు చేశారు. ఆవుపాలతో అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితికి స్వామి వారికి పూజలు చేయడంతో నాగ దోషాలు తొలిగిపోతాయని స్థానాచార్యులు పూర్ణానంద తెలిపారు.