అమరావతి : రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో అవసరమని , ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. అగ్రిగోల్డ్ భూములను (Agrigold lands illegally ) అక్రమంగా కొనుగోలు చేయలేదని, కావాలంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, సత్యప్రసాద్ వద్దకు వెళ్లి స్వయంగా తానే వివరిస్తానని పేర్కొన్నారు.
కక్ష ఉంటే నాపై తీర్చుకోవాలని, అమాయకుడైన నా కొడుకుపై అక్రమ కేసులు (Illegal cases ) పెట్టి జైలుకు పంపడం దారుణమని ఆరోపించారు. వైఎస్ జగన్(YS Jagan) పై టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో నిరసన తెలిపేందుకు వెళితే నాపై దాడి చేసి, మళ్లీ నా మీదనే కేసు పెట్టారని వెల్లడించారు. రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడే చంద్రబాబు(Chandra babu) కు, కూటమి నేతలకు విలువ లేదని దుయ్యబట్టారు.
ఏపీ ప్రజలు కూటమికి అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇచ్చారని, ఇచ్చిన సమయాన్ని ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి వినయోగించుకోవాలని సూచించారు. అభం, శుభం తెలియని నా కొడుకుపై అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదని అన్నారు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తామన్న విషయాన్ని గుర్తించాలని తెలిపారు.