అమరావతి : ఏపీలోని విజయవాడలో ( Vijayawada ) దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కొట్టుకుని చనిపోయారు. అన్నపూర్ణ థియేటర్ సమీపంలో మద్యం తాగిన అశోక్( Ashok) , కిశోర్ ( Kishore ) అనే వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడులు ( Attacks ) చేసుకున్నారు. ఇద్దరు తీవ్రగాయాలతో మృతి చెందారు. మృతులు విజయనగరానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. క్యాటరింగ్ పనుల కోసం ఇద్దరు విజయవాడకు వచ్చారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.