Srisailam | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఏపీ దేవాదాయశాఖ కమిషనర్ నారాయణ బుధవారం దర్శించుకున్నారు. సాయంత్రం శ్రీకృష్ణరాయ గోపురం వద్దకు చేరుకున్న వారికి ఈవో పెద్దిరాజు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు దర్శించుకున్నారు. అభిషేకం, కుంకుమార్చనల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితుల ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఈవో పెద్దిరాజు, ఏఈఓలు హరిదాస్, శ్రీనివాస్‌రావు, సీఎస్ఓ అయ్యన్న, సూపరిండెంట్ మల్లికార్జున్ పాల్గొన్నారు.